మరోసారి పోలీసులకు పూనమ్ కౌర్ ఫిర్యాదు
- కేసు వివరాలను తెలుసుకున్న పూనమ్
- 36 యూట్యూబ్ ఛానళ్లపై ఫిర్యాదు
- నిందితులను పట్టుకుంటామన్న అడిషనల్ డీసీపీ
అడిషనల్ డీసీపీ రఘువీర్‌ను కలిసిన పూనమ్ తన కేసుకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రఘువీర్ మీడియాతో మాట్లాడుతూ, పూనమ్ 36 యూట్యూబ్ ఛానళ్లపై ఫిర్యాదు చేశారని తెలిపారు. కేసు దర్యాప్తు చేసి త్వరలోనే నిందితులను పట్టుకుంటామని రఘువీర్ తెలిపారు.