కోడెల చేతిలో పోలీసులు కీలుబొమ్మలుగా మారొద్దు: అంబటి రాంబాబు
- ఇనిమెట్లలో దౌర్జన్యం చేసేందుకే కోడెల వెళ్లారు
- ఇనిమెట్లలో ఏ రోజూ గొడవలు జరగలేదు
- అలాంటి గ్రామంలో చిచ్చుపెట్టేందుకే కోడెల వెళ్లారు
చట్టం చట్ట ప్రకారం పని చేయాలని, సూచించిన అంబటి, పోలీస్ శాఖకు ఓ హెచ్చరిక చేశారు. కోడెల శివప్రసాద్ హయాంలో ఏవో పోస్టింగ్స్ వచ్చాయని చెప్పి, ఆయన్ని కాపాడేందుకు ప్రయత్నం చేస్తే కనుక వాళ్లకు కూడా శిక్ష తప్పదని హెచ్చరించారు. ఈ ఘటనలో కోడెల శివప్రసాద్ పై కేసు నమోదు చేయకపోతే నిరాహార దీక్ష చేస్తానని తాను చెప్పిన తర్వాతే ఆయనపై కేసు నమోదు చేశారని విమర్శించారు. కోడెల చేతిలో కీలుబొమ్మలుగా మారొద్దని పోలీసులకు అంబటి సూచించారు.