ప్రేమకు నో చెప్పిన యువతి.. ఇంటికొచ్చి కత్తితో నరికిన యువకుడు!
- తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో ఘటన
- అడ్డువచ్చిన తల్లిపై కూడా దాడి
- చుట్టుపక్కలవారు రావడంతో పరారీ
జిల్లాలోని శంషాబాద్ ప్రాంతంలో రమేశ్ అనే యువకుడు ఉంటున్నాడు. అదే ప్రాంతానికి చెందిన మరో యువతిని ప్రేమించిన రమేశ్, తనను ప్రేమించాల్సిందిగా వెంటపడ్డాడు. అయితే ఇందుకు యువతి నిరాకరించింది. దీంతో ఆగ్రహానికి లోనయిన యువకుడు కత్తి తీసుకుని యువతి ఇంటికి వెళ్లాడు. ఆమెపై దాడికి దిగాడు. కుమార్తెపై దాడిని చూసినవెంటనే యువతి తల్లి రమేశ్ ను అడ్డుకుంది.
దీంతో ఆమెపై కూడా రమేశ్ దాడికి పాల్పడ్డాడు. వీరిద్దరి కేకలతో చుట్టుపక్కలవారు ఘటనాస్థలికి చేరుకోగానే, నిందితుడు భయంతో పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన శంషాబాద్ పోలీసులు, నిందితుడిని అరెస్ట్ చేశారు. కాగా, తల్లీకుమార్తెలకు తీవ్రగాయాలు కాగా, స్థానికంగా ఉండే ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వీరిని చేర్పించి చికిత్స అందజేస్తున్నారు.