ఎస్సీ, ఎస్టీలకు ఈ ఏడాదికి పది లక్షల ఇళ్లు
రాష్ట్రంలోని ఎస్సీఎస్టీ బలహీన వర్గాల కోసం ఈ ఏడాది పది లక్షల ఇళ్లు నిర్మించనున్నట్టు గృహనిర్మాణ శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. భువనగిరిలో మాట్లాడిన ఆయన ఎస్సీ ఎస్టీ కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు వెయ్యికోట్లు కేటాయించామన్నారు. ఉప ప్రణాళిక అమలుకు ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నట్టు తెలిపారు. పార్టీకి అండగా ఉంటే మంచి భవిష్యత్తు ఉంటుందని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.