తెలంగాణ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోమన్న హైకోర్టు!

  • బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తేల్చాలని పిటిషన్
  • ఈ పిటిషన్ పై హైకోర్టులో విచారణ
  • ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వొద్దన్న ఉత్తర్వులు ఇవ్వలేం: హైకోర్టు
తెలంగాణలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే. బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తేల్చే వరకూ ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వొద్దని కోరుతూ హైకోర్టులో బీసీ సంఘ నాయకులు వేసిన పిటిషన్ పై ఈరోజు విచారణ జరిగింది. ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వొద్దన్న ఉత్తర్వులు ఇవ్వలేమని, ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. రిజర్వేషన్ల అంశంపై మూడు వారాల్లో వివరణ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణ ఈ నెల 22కు వాయిదా వేసింది.
Go Back to Shorts
Telangana
High Court
mptc
zptc
EC

More Telugu News