కమెడియన్ గా జోష్ పెంచుతోన్న సునీల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కమెడియన్ గా జోష్ పెంచుతోన్న సునీల్

  • హీరోగా విజయాలు లేని సునీల్
  • కమెడియన్ గా మళ్లీ రంగంలోకి
  • వరుసగా పెద్ద ప్రాజెక్టులలో అవకాశాలు
హీరోగా విజయాలు కలిసి రాకపోవడంతో కమెడియన్ గా సునీల్ మళ్లీ వెనక్కి వచ్చేశాడు. ఒక్కో సినిమాలో అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ మళ్లీ కమెడియన్ గా తన పూర్వ స్థానానికి చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇటీవల విడుదలైన 'చిత్రలహరి' సినిమాలో సునీల్ చేసిన పాత్రకి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఆయనని వెతుక్కుంటూ చాలానే అవకాశాలు వస్తున్నాయట.

త్రివిక్రమ్ .. అల్లు అర్జున్ కాంబినేషన్లో సెట్స్ పైకి వెళ్లనున్న సినిమాలోనూ సునీల్ ఛాన్స్ దక్కించుకున్నాడు. అంతేకాదు .. చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందే సినిమాలోను సునీల్ కి అవకాశం లభించినట్టుగా సమాచారం. ఈ రెండు ప్రాజెక్టులు పెద్దవి కావడం .. సునీల్ పాత్రకి ప్రాధాన్యత ఉండటం వలన, ఆయన అనుకున్న సమయానికంటే ముందే కమెడియన్ గా బిజీ అవుతాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి కమెడియన్ గా జోష్ పెంచడంలో సునీల్ సక్సెస్ అయ్యాడన్న మాట.
sunil

More Telugu News