ప్రచారానికి 75 లక్షలిస్తారా? కిడ్నీలు అమ్ముకోవాలా? ఈసీకి ఎంపీ అభ్యర్థి లేఖ!
- బాలాఘాట్ నుంచి పోటీ పడుతున్న కిశోర్ సమ్మిట్
- గతంలో సమాజ్ వాదీ ఎమ్మెల్యేగా ఉన్న నేత
- స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి
- ఖర్చు చేసేందుకు డబ్బు లేదని వాపోయిన నేత
ఎన్నికల ప్రచారానికి మరో 15 రోజులు మాత్రమే గడువుందని ప్రస్తావిస్తూ, తాను రూ. 75 లక్షలు ఖర్చు చేయవచ్చని నియమావళి చెబుతున్నందున ఆ డబ్బు ఇప్పించాలని, బ్యాంకుల నుంచైనా రుణం ఇప్పించాలని, లేకుంటే కిడ్నీలు విక్రయించుకునేందుకు అనుమతించాలని కోరారు. తాను రాసిన లేఖను మీడియాకు విడుదల చేసిన సందర్భంగా మాట్లాడిన ఆయన, డబ్బులు ఉన్నవారే పోటీలో ఉన్నారని, ఈసీ నియమాలు కూడా అలాగే ఉన్నాయని, ప్రస్తుత నిబంధనలను మార్చాలని డిమాండ్ చేశారు. డబ్బు ఖర్చు పెట్టేందుకు అనుమతి ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించారు. ఈ చట్టాల ప్రకారం సామాన్యులు పోటీ చేసే అవకాశం లేదన్నారు.