హనుమంతుడి గుడిలో కళ్లు మూసుకుని మౌనంగా కూర్చుండిపోయిన యోగి ఆదిత్యనాథ్!
- 72 గంటల పాటు ప్రసంగాలపై నిషేధం
- మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడారని తేల్చిన ఈసీ
- ఆంజనేయునికి మౌన పూజలు చేసిన యూపీ సీఎం
దేవాలయానికి వచ్చిన ఆయన, ఏమీ మాట్లాడకుండా, కళ్లు మూసుకుని మౌనంగా పూజలు చేశారు. ఇటీవల ఆయన ముస్లింలకు అలీ ఉంటే, హిందువులకు బజరంగ్ బలి ఉన్నాడని వ్యాఖ్యానించిన నేపథ్యంలో, ఇవి మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని ఈసీ భావించింది. ఈ నేపథ్యంలోనే ఆయన ప్రచారంపై మూడు రోజుల నిషేధాన్ని విధించింది. మాయావతి తదితరులపైనా ఇదే తరహా నిషేధాన్ని ఈసీ విధించిన సంగతి తెలిసిందే.