తన రాజకీయ పార్టీ గుర్తేంటో చెప్పేసిన హీరోయిన్ ఆలియా భట్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తన రాజకీయ పార్టీ గుర్తేంటో చెప్పేసిన హీరోయిన్ ఆలియా భట్!

  • నేను రాజకీయాల్లోకి వస్తే 'ప్లేట్' సింబల్
  • ప్లేట్ కు జీవితంలో ఎంతో ప్రాధాన్యం ఉంది
  • ఈ గుర్తును ఇంతవరకూ ఎవరూ ఎంచుకోలేదు
  • కపిల్ శర్మ షోలో ఆలియా భట్
బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ తన రాజకీయ పార్టీ గుర్తేంటో చెప్పేశారు. ఆమె పాలిటిక్స్ లోకి ఎప్పుడు వచ్చిందని అనుకుంటున్నారా? రాజకీయాల్లోకి రాలేదుగానీ, వస్తే మాత్రం 'ప్లేట్'ను తన గుర్తుగా ఎంచుకుంటానని చెప్పింది. తాజాగా కపిల్ శర్మ షోలో పాల్గొన్న ఆమె, ఇటీవలి కాలంలో తాను ఎక్కడికి వెళ్లినా రాజకీయాల ప్రస్తావన వస్తోందని, మీడియా కూడా ఇవే ప్రశ్నలు వేస్తోందని చెప్పిన ఆమె, 'ప్లేట్' గుర్తును ఇంతవరకూ ఎవరూ ఎంచుకోలేదని, జీవితంలో ప్లేట్ కు ఎంతో ప్రాధాన్యం ఉందని వ్యాఖ్యానించింది.

ప్రస్తుతం తాను నటించిన 'కళంక్' సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్న ఆమె, కపిల్ శర్మ షోలో వరుణ్ ధావన్ తో కలిసి పాల్గొంది. ఇక ఆలియా భట్ కే వేసిన ప్రశ్నను వరుణ్ ను అడుగగా, తాను 'చెడ్డీ'ని గుర్తుగా ఎంచుకుంటానని చెప్పడంతో, వీక్షకులంతా నవ్వుల్లో మునిగిపోయారు. కాగా, ఆలియా, వరుణ్ లతో పాటు సంజయ్ దత్, మాధురీ దీక్షిత్, సోనాక్షీ సిన్హా, ఆదిత్యా రాయ్ కపూల్ తదితరులతో నిర్మాత కరణ్ జోహార్ 'కళంక్' చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇటీవలే సినిమా టీజర్, ట్రయిలర్ విడుదల కాగా, ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.
Alia Bhat
Plate
Politics
Kapil Sharma

More Telugu News