విజయనగరం చిన్న మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం
- అగ్నికి ఆహుతైన 50 షాపులు
- అందరూ చిరు వ్యాపారులే
- ఏళ్ల నాటి నుంచి వర్తకం చేస్తూ జీవనోపాధి
ఈ మార్కెట్‌ను ఆనుకుని కన్యాకాపరమేశ్వరి ఆలయం రోడ్డువైపు బంగారం షాపులు కూడా ఉన్నాయి. నిత్యం ఎంతో రద్దీగా ఉండే ఈ మార్కెట్ ఇరుకుగా ఉంటుంది. ఇందులో కూరగాయల మార్కెట్లో ప్రమాదం చోటు చేసుకుంది. ఓ షాపులో గ్యాస్ సిలిండర్ పేలుడు జరగడంతో ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. మంటలను గుర్తించినప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పెద్ద ఎత్తున లేచిన అగ్నికీలలు చుట్టుపక్కల ఉన్న యాభై షాపులకు విస్తరించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన చేరుకుని మంటల్ని అదుపులోకి తెచ్చారు.