ఈవీఎంలు హ్యాకింగ్ చేయొచ్చని గతంలోనే చెప్పాను: ఏపీ ప్రభుత్వ సాంకేతిక సలహాదారు హరిప్రసాద్
- నాడు వీవీప్యాట్స్ రూపకల్పనలో సలహాలిచ్చాను
- వీవీప్యాట్స్ లో సమస్యలు చెప్పేందుకు ఈసీని కలిశా
- రాజకీయ కారణాలతో నన్ను అనుమతించ లేదు
గతంలో వీవీప్యాట్స్ రూపకల్పనలో ఈసీ తన సలహాలు తీసుకున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ సందర్భంగా హరిప్రసాద్ మాట్లాడుతూ, వీవీప్యాట్స్ లో ఉన్న సమస్యలను తెలిపేందుకు ఈసీ వద్దకు వెళ్లానని, అయితే, రాజకీయ కారణాలతోనే తనను అనుమతించ లేదని అన్నారు. ఎన్నికల నిర్వహణ పారదర్శకంగా జరగాలని ఈ సందర్భంగా హరిప్రసాద్ కోరారు.