సహోద్యోగులపై కక్ష.. కంపెనీ డబ్బు నొక్కేసి.. రూ. 2 కోట్లను ఒక్కరాత్రిలో ఖర్చు పెట్టేసిన ఘనుడు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సహోద్యోగులపై కక్ష.. కంపెనీ డబ్బు నొక్కేసి.. రూ. 2 కోట్లను ఒక్కరాత్రిలో ఖర్చు పెట్టేసిన ఘనుడు!

  • ఉద్యోగుల జీతాలను నొక్కేసిన బ్రిటన్ అకౌంటెంట్
  • బయట పడిపోతానని మొత్తం డబ్బూ ఖర్చు
  • ఖరీదైన డ్రగ్స్, అమ్మాయిలతో ఎంజాయ్
తాను పనిచేస్తున్న కంపెనీ ఉద్యోగులు తనను ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారన్న ఆగ్రహంతో, దాదాపు రూ. 2 కోట్లను నొక్కేసిన ఓ అకౌంటెంట్, తాను పట్టుబడటం ఖాయమని భావించి, అంతకన్నా ముందే ఆ డబ్బులు ఖర్చు పెట్టేయాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నంత పనినీ చేశాడు.

ఖరీదైన నైట్ క్లబ్ లో ప్రైవేట్ రూమ్ ను బుక్ చేయించుకున్నాడు. రాత్రంతా ఒకరి తరువాత ఒకరు అమ్మాయిలను పిలిపించుకున్నాడు. 10 మందిని పిలిపించుకుని, వారితో కలిసి ఖరీదైన డ్రగ్స్ తీసుకుంటూ ఎంజాయ్ చేశాడు. ఉదయం 9 గంటల సమయానికి రెండు కోట్లనూ ఖర్చు చేసేసి తన కారులో ఎంచక్కా ఇంటికి వెళ్లిపోయాడు.

ఆపై పట్టుబడి, ప్రస్తుతం జైల్లో ఊచలు లెక్కిస్తున్న ఇతగాడి పేరు డారెన్. బ్రిటన్ లో ఈ ఘటన జరిగింది. తనను ఇబ్బందులు పెడుతున్న సహోద్యోగులపై కోపం పెంచుకుని, వారికి వేతనం రాకుండా చేయాలని ప్లాన్ వేశాడు. ఎలాగూ జీతాల పంపిణీ తన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి, మొత్తం డబ్బును తన ఖాతాల్లోకి మళ్లించుకున్నాడు. అంత డబ్బుతో పారిపోలేనని భావించి, రాత్రికి రాత్రే జీవితాన్ని అనుభవించేయాలనుకున్నాడు. డబ్బునంతా విచ్చలవిడిగా ఖర్చు పెట్టాడు. అమ్మాయిలకు చేతికొచ్చినంత టిప్పులిచ్చి, తన వద్ద ఉన్న మొత్తం డబ్బునూ హారతికర్పూరం చేశాడు.

ఇక ఉదయం విషయం తెలియడంతో ఆ కంపెనీ బాస్ పోలీసులను ఆశ్రయించగా, అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కంపెనీ యజమాని మాత్రం డారెన్ మంచి వ్యక్తని, ఇలాంటి పని చేస్తాడని కలలో కూడా ఊహించలేదని వ్యాఖ్యానించడం గమనార్హం.
Britain
Salaries
One Night

More Telugu News