హిందీలో 'ఆర్ ఎక్స్ 100' రీమేక్ .. హీరోగా సునీల్ శెట్టి తనయుడు
- తెలుగులో హిట్ కొట్టిన 'ఆర్ ఎక్స్ 100'
- ఈ సినిమాతో అహన్ శెట్టి హీరోగా పరిచయం
- రంగంలోకి హాలీవుడ్ ఫైట్ మాస్టర్
మిలన్ లుథ్రియా దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. సాజిద్ నడియాడ్ వాలా ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వచ్చేనెలలో ఈ సినిమా షూటింగు మొదలు కానుంది. హాలీవుడ్ స్టంట్ మాస్టర్ 'స్టీఫెన్ రిచ్చర్'ను ఈ సినిమా కోసం రంగంలోకి దింపారు. గతంలో ఈయన సల్మాన్ 'కిక్' సినిమాకి పనిచేసిన సంగతి తెలిసిందే.