నన్ను కొనేంత ఆస్తి మీ దగ్గర లేదు: రేణుకా చౌదరి

  • ఖమ్మం ఎన్నికలలో చారిత్రాత్మక తీర్పు రాబోతోంది
  • ధన రాజకీయాలు నాకు గిట్టవు
  • కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తల జోలికి వస్తే నేను సహించను
ఖమ్మం లోక్ సభ ఎన్నికలలో చారిత్రాత్మక తీర్పు రాబోతోందని కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరి అన్నారు. ధన రాజకీయాలు తనకు గిట్టవని... అందుకే ఎన్నికల్లో డబ్బు పంచలేదని చెప్పారు. ధన రాజకీయం కంటే ప్రజా రాజకీయం వైపు ఖమ్మం ప్రజలు మొగ్గు చూపారని తెలిపారు. ఎన్నికలలో తనను కించపరిచేలా ఎన్నో ప్రచారాలు చేశారని, మానసికంగా తనను గాయపరిచారని చెప్పారు.

తనను గెలిపించేందుకు కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తలు చేసిన కృషి చాలా గొప్పదని... అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానని రేణుక అన్నారు. కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తల జోలికి ఎవరు వచ్చినా తాను సహించనని చెప్పారు. ప్రేమ, అభిమానంతో తనను ఎవరైనా పలకరించవచ్చని... డబ్బుతో తనను కొనేంత ఆస్తి మీ దగ్గర లేదని టీఆర్ఎస్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
Go Back to Shorts
renuka chowdary
khammam
congress

More Telugu News