15 యేళ్ల తరువాత నాగార్జున సరసన నాయికగా జ్యోతిక?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

15 యేళ్ల తరువాత నాగార్జున సరసన నాయికగా జ్యోతిక?

  • నాగ్ కథానాయకుడిగా 'బంగార్రాజు'
  • నాయిక పాత్ర కోసం జ్యోతికతో సంప్రదింపులు
  • గతంలో ఇదే కాంబినేషన్లో వచ్చిన 'మాస్'
రొమాంటిక్ హీరోగా .. పల్లెటూరి బుల్లోడుగా నాగార్జునను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన 'సోగ్గాడే చిన్నినాయనా' .. భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమాలో నాగార్జున పోషించిన 'బంగార్రాజు' పాత్ర జనంలోకి బాగా వెళ్లింది. దాంతో ఆ పాత్ర పేరుతోనే నాగార్జున ఒక సినిమా చేస్తున్నారు. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

ఈ సినిమాలో కథానాయికగా నయనతార అయితే బాగుంటుందని భావించి ఆమెను సంప్రదించారు. అయితే డేట్స్ ఖాళీ లేని కారణంగా తాను ఈ సినిమా చేయలేనని నయనతార చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి. తాజాగా 'జ్యోతిక' పేరు తెరపైకి వచ్చింది. ఆమెతో సంప్రదింపులు జరుగుతున్నట్టుగా సమాచారం. 15 యేళ్ల క్రితం నాగార్జున సరసన ఆమె 'మాస్' సినిమా చేసింది. రీ ఎంట్రీ తరువాత కథల ఎంపిక విషయంలో మరింత శ్రద్ధ వహిస్తోన్న జ్యోతిక, ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో లేదో చూడాలి. 
nagarjuna
jyothika

More Telugu News