ప్రకాశ్ రెడ్డీ, మేము ఫ్యాక్షన్ వదిలేశాం.. మళ్లీ ప్రారంభించవద్దు: పరిటాల సునీత వార్నింగ్
- 14 ఏళ్ల క్రితమే ఫ్యాక్షన్ ను వదిలేశాం
- శాంతియుతంగా ఉన్నాం
- మాపై దాడులకు ఉసిగొల్పకండి
అనంతరం మీడియాతో ఆమె మాట్లాడుతూ, వైసీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాశ్ కు హెచ్చరిక జారీ చేశారు. 'ప్రకాశ్ రెడ్డీ, మీకు నేను ఒకటే చెబుతున్నా. 14 ఏళ్ల క్రితమే మేము ఫ్యాక్షన్ వదిలేశాం. శాంతియుతంగా ఉన్నాం. నియోజకవర్గ అభివృద్ధి కోసం పని చేస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ ఫ్యాక్షన్ ను ప్రారంభించేందుకు ప్రయత్నించవద్దు. మాపై దాడులకు ఉసిగొల్పడం మానుకోండి' అని వ్యాఖ్యానించారు.