టీడీపీ నేత జలీల్ ఖాన్ పై వైసీపీ కార్యకర్తల దాడి

  • విజయవాడలోని తారాపేటలో ఘటన
  • ప్రతిదాడికి పాల్పడ్డ జలీల్ ఖాన్ అనుచరులు
  • పోలీసుల అదుపులో దాడులకు పాల్పడ్డ కార్యాకర్తలు
విజయవాడ టీడీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కారుపై వైసీపీ కార్యాకర్తలు దాడికి పాల్పడ్డారు. స్థానిక తారాపేటలో ఆయన కారుపై వైసీపీ కార్యకర్తలు దాడి చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో జలీల్ ఖాన్ అనుచరులు ప్రతి దాడికి పాల్పడ్డారు. వించిపేటలోని వైసీపీ కార్యకర్తలపై దాడి చేశారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని టీడీపీ, వైసీపీ కార్యకర్తలను చెదరగొట్టారు. దాడులకు పాల్పడ్డ వారిని అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఆయా ఘటనల్లో ద్విచక్ర వాహనాలు దెబ్బతిన్నాయి.
Go Back to Shorts
Vijayawada
Telugudesam
YSRCP
MLA
Jaleel khan

More Telugu News