టీడీపీపై ఈసీకి ఫిర్యాదు చేసిన విజయసాయిరెడ్డి
- హింసకు కుట్రలు పన్నుతున్నారు
- చంద్రబాబు ఈసీనే బెదిరించేందుకు ప్రయత్నించారు
- అల్లర్లు సృష్టించి వైసీపీపై నెడుతున్నారు
వేటకొడవళ్లతో దాడులకు పాల్పడుతోంది టీడీపీ నేతలే అని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబునాయుడు సైతం ఎన్నికల అధికారులను బెదిరించే విధంగా మాట్లాడారని, ఆయనపైనా చర్యలు తీసుకోవాలని విజయసాయిరెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కడప జిల్లాలో సైతం కొందరు పోలీసులు అధికార పక్షానికి కొమ్ముకాస్తున్నారని అన్నారు.