Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'గల్లీబాయ్'లో అలియా భట్ పాత్ర నాకు నచ్చలేదు: కంగనా రనౌత్

  • అలియా భట్ నాకు పోటీ ఎలా అవుతుంది?
  • ఆమె పాత్ర అంత గొప్పదేం కాదు
  • నాకు మాత్రం చాలా రొటీన్ గా అనిపించింది  
బాలీవుడ్లో కంగనా రనౌత్ రెబల్ హీరోయిన్ గా కొనసాగుతోంది. పెద్ద హీరోలను .. హీరోయిన్లను సైతం లెక్కచేయకుండా ఆమె తన జోరును కొనసాగిస్తోంది. ఎదుటివారు ఎవరైనా సరే వాళ్లను గురించి తన మనసులోని మాటను నిర్మొహమాటంగా చెప్పేయడం .. బాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారిపోవడం కంగనా ప్రత్యేకత. తాజాగా ఆమె అలియా భట్ గురించి చేసిన కామెంట్లు బాలీవుడ్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

ప్రస్తుతం బాలీవుడ్లో పలు రకాల అవార్డుల కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ అవార్డుల వేడుకల్లో కంగనా 'మణికర్ణిక' .. అలియా భట్ 'గల్లీబాయ్' పోటీపడుతున్నాయి. 'మణికర్ణిక'లో ఉత్తమనటిగా కంగనాకు అవార్డు లభించింది. ఈ నేపథ్యంలోనే .. 'అలియా భట్ నుంచి గట్టిపోటీ ఎదురైందా?' అనే ప్రశ్న కంగనాకు ఎదురైంది.

అందుకు ఆమె స్పందిస్తూ .. 'గల్లీబాయ్' లో అలియా పాత్ర అంతగొప్పదేం కాదు .. నిజం చెప్పాలంటే చాలా రొటీన్ గా వుంది. ఆమె పోషించిన ఆ పాత్ర నాకెంతమాత్రం నచ్చలేదు. అలాంటి పాత్ర నుంచి నాకు గట్టిపోటీ ఎలా ఎదురవుతుంది? అలాంటి చెత్త పాత్రలకి ప్రాధాన్యతనివ్వడం మానుకుంటే బాగుంటుంది' అంటూ కటువుగా సమాధానమిచ్చింది. ఆమె స్పందనపై అలియా ఎలా ప్రతిస్పందిస్తుందో చూడాలి.
kangana
aliya bhatt

More Telugu News