'గల్లీబాయ్'లో అలియా భట్ పాత్ర నాకు నచ్చలేదు: కంగనా రనౌత్
- అలియా భట్ నాకు పోటీ ఎలా అవుతుంది?
- ఆమె పాత్ర అంత గొప్పదేం కాదు
- నాకు మాత్రం చాలా రొటీన్ గా అనిపించింది
ప్రస్తుతం బాలీవుడ్లో పలు రకాల అవార్డుల కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ అవార్డుల వేడుకల్లో కంగనా 'మణికర్ణిక' .. అలియా భట్ 'గల్లీబాయ్' పోటీపడుతున్నాయి. 'మణికర్ణిక'లో ఉత్తమనటిగా కంగనాకు అవార్డు లభించింది. ఈ నేపథ్యంలోనే .. 'అలియా భట్ నుంచి గట్టిపోటీ ఎదురైందా?' అనే ప్రశ్న కంగనాకు ఎదురైంది.
అందుకు ఆమె స్పందిస్తూ .. 'గల్లీబాయ్' లో అలియా పాత్ర అంతగొప్పదేం కాదు .. నిజం చెప్పాలంటే చాలా రొటీన్ గా వుంది. ఆమె పోషించిన ఆ పాత్ర నాకెంతమాత్రం నచ్చలేదు. అలాంటి పాత్ర నుంచి నాకు గట్టిపోటీ ఎలా ఎదురవుతుంది? అలాంటి చెత్త పాత్రలకి ప్రాధాన్యతనివ్వడం మానుకుంటే బాగుంటుంది' అంటూ కటువుగా సమాధానమిచ్చింది. ఆమె స్పందనపై అలియా ఎలా ప్రతిస్పందిస్తుందో చూడాలి.