వృద్ధుల ఓట్లను తానే వేస్తున్న ఎన్నికల అధికారి.. టీడీపీ నేతల సీరియస్

  • శ్రీకాకుళం జిల్లా రాజాం పోలింగ్ బూత్ లో ఘటన
  • అభ్యంతరం వ్యక్తం చేసిన టీడీపీ
  • ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన కొండ్రు మురళి
టీడీపీ, వైసీపీ నేతలు, కార్యకర్తల పరస్పర దాడులతో ఇప్పటికే ఏపీ ఎన్నికల పోలింగ్ వేడివేడిగా కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మరో వింత పరిణామం చోటు చేసుకుంది. శ్రీకాకుళం జిల్లా రాజాం ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఓ పోలింగ్ బూత్ లో పోలింగ్ అధికారి గిరిబాబు... వృద్ధుల ఓట్లను స్వయంగా వేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. మరో పార్టీకి ఓట్లు వేస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ వ్యవహారంపై మాజీ మంత్రి కొండ్రు మురళి ఎన్నికల ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
Go Back to Shorts
srikakulam
rajam
polling
officer

More Telugu News