స్పీకర్ కోడెల శివప్రసాద్ పై దాడి.. పరిస్థితి ఉద్రిక్తం

  • సత్తెనపల్లి నియోజకవర్గం ఇనుమెట్లలో వైసీపీ నేతల దాడి
  • కోడెల చొక్కాను చింపేసిన వైనం
  • గన్ మెన్లపై రాళ్లతో దాడి
ఏపీలో ఎన్నికల పోలింగ్ రణరంగాన్ని తలపిస్తోంది. పలు చోట్ల టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలం ఇనుమెట్లలో వైసీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. ఏకంగా స్పీకర్ కోడెల శివప్రసాద్ పై వైసీపీ నేతలు దాడికి తెగబడ్డారు. ఆయన చొక్కాను చింపేశారు. ఆయనకు అడ్డుగా నిలిచిన గన్ మెన్లపై రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో కోడెలకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేసి, పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Go Back to Shorts
kodela
Telugudesam
ysrcp
attack

More Telugu News