ఎవరికి ఓటేసినా వీవీ ప్యాట్ లో కారు గుర్తు: పోలింగ్ ఆపివేయాలని కోమటిరెడ్డి డిమాండ్
- భువనగిరిలో ట్యాంపరింగ్ చేస్తున్నారు
- రీపోలింగ్ జరపాలి
- నల్గొండలో ఓటేసిన అనంతరం కోమటిరెడ్డి
ఈ పోలింగ్ బూత్ లలో ఎవరికి ఓటు వేసినా, వీవీ ప్యాట్ మెషీన్లలో కారు గుర్తు కనిపిస్తోందని ఆయన ఆరోపించారు. ఆయా ప్రాంతాల నుంచి తనకు ఫిర్యాదులు వచ్చాయని, ఇప్పటికే ఈ విషయాన్ని రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకువెళ్లానని అన్నారు. ఈ ప్రాంతాల్లో వెంటనే పోలింగ్ ను ఆపేసి, రీపోలింగ్ జరపాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ నాయకులు అవకతవకలకు పాల్పడే అవకాశాలు ఉన్నాయని, కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని అన్నారు.