Andhra Pradesh: ఈసారి టీవీ తెరలపైనా ఏపీ ఇంటర్ రిజల్ట్స్ చూసుకోవచ్చు!

షార్ట్స్‌లో చూడండి
ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలను ఎల్లుండి ఏప్రిల్ 12న విడుదల చేయనున్నారు. విశేషం ఏమిటంటే, ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించిన ఫలితాలు ఒకే రోజున రానున్నాయి. ఇంటర్ రిజల్ట్స్ ను ఆర్టీజీఎస్ వెబ్ సైట్ (www.rtgs.ap.gov.in) లో కూడా తెలుసుకునే అవకాశం కల్పించారు. అంతేకాకుండా, పీపుల్స్ ఫస్ట్ సిటిజన్ మొబైల్ యాప్ లోనూ, ఖైజాలా యాప్ తోనూ ఇంటర్ ఫలితాలు తెలుసుకోవచ్చు.

ఇక, మొదటిసారిగా ఇంటర్ ఫలితాలను ఏపీ ఫైబర్ నెట్ ద్వారా టెలివిజన్ తెరలపైనా చూసుకునే సదుపాయం తీసుకొస్తున్నారు. తమ నివాసాల్లో ఏపీ ఫైబర్ నెట్ బాక్సులు ఉన్నవాళ్లు టీవీ రిమోట్ ద్వారా హాల్ టికెట్ నంబర్ టైప్ చేయగానే ఫలితాలు ప్రత్యక్షమవుతాయి. ఈ మేరకు ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు ఏర్పాట్లు చేసింది.
Go Back to Shorts
Andhra Pradesh
Inter

More Telugu News