ఏపీ ఓటర్ల కోసం ప్రత్యేక రైళ్లను వేస్తున్నట్టు ప్రకటించిన రైల్వే శాఖ
- సాయంత్రం 6:20కి కాకినాడకు ప్రత్యేక రైలు
- రాత్రి 7:20కి తిరుపతికి ప్రత్యేక రైలు
- రాత్రి 9 గంటలకు లింగంపల్లి నుంచి కాకినాడ
ఇక ఇటు రైళ్లలో కూడా నిలబడేందుకు సైతం చోటు దొరక్కపోవడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని సికింద్రాబాద్ నుంచి ఏపీకి రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను వేసినట్టు ప్రకటించింది. నేటి సాయంత్రం 6:20కి సికింద్రాబాద్ నుంచి కాకినాడకు, రాత్రి 7:20కి సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ప్రత్యేక రైలును వేసినట్టు రైల్వేశాఖ తెలిపింది. రాత్రి 9 గంటలకు లింగంపల్లి నుంచి కాకినాడకు కూడా ప్రత్యేక రైలును నడుపుతున్నట్టు వెల్లడించింది.