బీజేపీ వారి మేనిఫెస్టో సూపర్.. 100కు 200 మార్కులు వేస్తున్నాం: శివసేన
- రామ మందిర నిర్మాణం, ఆర్టికల్ 370 తొలగింపుకు పెద్ద పీట వేశారు
- ఇతర రాష్ట్రాల్లోని చట్టాలు జమ్ముకశ్మీర్ లో అమలు కావడం లేదు
- రైతుల సంక్షేమానికి పెద్దపీట వేశారు
రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూనే... రామ మందిరం, ఆర్టికల్ 370లకు ప్రధాని మోదీ అత్యంత ప్రాధాన్యతను ఇచ్చారని శివసేన అధికారిక పత్రిక సామ్నా కొనియాడింది. ఆర్టికల్ 370ని తొలగించేందుకు కేంద్రం అన్ని చర్యలు తీసుకోవాలని... అప్పుడే శాంతి కోసం ప్రాణాలు అర్పించిన వారికి నిజమైన నివాళి అర్పించినట్టు అవుతుందని చెప్పారు. ఈ ఆర్టికల్ వల్లే దేశంలోని ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న చట్టాలు, నిబంధనలు జమ్ముకశ్మీర్ లో అమలు కావడం లేదని అన్నారు. జనసంఘ్ ఉన్న సమయం నుంచే ఆర్టికల్ 370ను తొలగించాలని తాము డిమాండ్ చేస్తున్నామని చెప్పారు.