కమల్ కారణంగా నేను చాలా నష్టపోయా: తమిళ హాస్య నటుడు వివేక్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కమల్ కారణంగా నేను చాలా నష్టపోయా: తమిళ హాస్య నటుడు వివేక్

  • చాలామంది హీరోలతో చేశాను 
  • నేను హీరోగా చేసినవి ఆడలేదు
  •  'నాన్ థాన్' కి థియేటర్లు దొరకలేదు
హాస్యనటుడిగా తమిళంలో వివేక్ చాలా చిత్రాలలో నటించారు. తమిళ అనువాద చిత్రాల ద్వారా ఆయన తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. తమిళంలో ఆయన ప్రధాన పాత్రధారిగా 'వెళ్లై పుక్కల్' సినిమా నిర్మితమైంది. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో, మాజీ పోలీస్ అధికారిగా వివేక్ కనిపించనున్నాడు. ఈ నెల 19వ తేదీన ఈ సినిమా విడుదల ఉండటంతో, ప్రమోషన్స్ లో వివేక్ బిజీగా వున్నాడు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. "నా కెరియర్లో చాలామంది హీరోలతో కలిసి పనిచేశాను .. కానీ నేను హీరోగా చేసిన సినిమాలు మాత్రం సరిగ్గా ఆడలేదు. ముఖ్యంగా నేను చేసిన 'నాన్ థాన్' అంటే నాకు ఎంతో ఇష్టం. అలాంటి ఆ సినిమా సరిగ్గా ఆడకపోవడానికి కమల్ కారణం. నా సినిమా సమయంలోనే కమల్ .. 'పాపనాశం' చిత్రాన్ని థియేటర్లలోకి దింపాడు. దాంతో నా సినిమాకి థియేటర్లు లేక సరిగ్గా ఆడలేదు .. కమల్ కారణంగా పెద్ద మొత్తంలో నష్టపోయాను" అంటూ చెప్పుకొచ్చాడు.
vivek

More Telugu News