కీర్తి సురేశ్ పై దృష్టిపెట్టిన కొరటాల .. మెగాస్టార్ సరసన ఛాన్స్?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కీర్తి సురేశ్ పై దృష్టిపెట్టిన కొరటాల .. మెగాస్టార్ సరసన ఛాన్స్?

  • చిరూ 151వ సినిమాగా 'సైరా'
  • కొరటాలతో చిరూ తదుపరి సినిమా
  •  తెరపైకి కీర్తి సురేశ్ పేరు  
చిరంజీవి 151వ సినిమాగా 'సైరా' రూపొందుతోంది. భారీ బడ్జెట్ తో నిర్మితమవుతోన్న ఈ చారిత్రక చిత్రం కోసం మెగా అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా తరువాత చిరంజీవి .. కొరటాలతో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ను కొరటాల పూర్తి చేసేశాడని అంటున్నారు.

ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం శ్రుతి హాసన్ ను ఎంపిక చేసినట్టుగా వార్తలు వచ్చాయి. తాజాగా కీర్తి సురేశ్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో కీర్తి సురేశ్ కి ఇప్పుడు ఒక రేంజ్ లో ఇమేజ్ వుంది. అందువలన ఆమెను తీసుకోవాలనే ఉద్దేశంతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా సమాచారం. అయితే శ్రుతి హాసన్ బదులుగా కీర్తి సురేశ్ ను తీసుకోనున్నారా? లేదంటే మరో కథానాయికగా తీసుకోనున్నారా? అనే విషయంలో క్లారిటీ రావలసి వుంది. ఈ చిత్రం జూన్ నుంచి సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది.
chiranjeevi
keerthi suresh

More Telugu News