దుర్మార్గమైన ఎన్నికల సంఘం తీరును ప్రజలు గమనిస్తున్నారు: నారా లోకేశ్

  • ప్రతిపక్షం చేసే ఆరోపణలపై ఈసీ అతిగా స్పందిస్తోంది
  • టీడీపీ చేసే ఫిర్యాదులను మాత్రం పట్టించుకోవట్లేదు
  • ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఈసీ ఎందుకు విస్మరిస్తోంది?
ప్రతిపక్షం చేసే ఆరోపణలపై అతిగా స్పందిస్తున్న ఎన్నికల సంఘం, టీడీపీ చేసే ఫిర్యాదులను మాత్రం పట్టించుకోవడం లేదని టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శించారు. అన్ని పార్టీలకు సమాన అవకాశాలు కల్పించాలన్న ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఈసీ ఎందుకు విస్మరిస్తోందని ప్రశ్నించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఐటీ దాడుల గురించి లోకేశ్ ప్రస్తావించారు. టీడీపీ అభ్యర్థులు, నాయకులు, మద్దతుదారులే లక్ష్యంగా ఐటీ దాడులు జరగడం దేనికి సంకేతం? అని ప్రశ్నించారు. దుర్మార్గమైన ఎన్నికల సంఘం తీరును ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. 
Go Back to Shorts
Andhra Pradesh
Elections
2019
Nara Lokesh

More Telugu News