సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • 'రాక్షసుడు' సినిమా అప్ డేట్స్ 
  • 'బంగార్రాజు'లో యువ హీరో గెస్ట్ రోల్ 
  • విజయ్ దేవరకొండ మరో చిత్రం  
*  బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న 'రాక్షసుడు' చిత్రం అరవై శాతం షూటింగును పూర్తిచేసుకుంది. రమేశ్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఈద్ పండుగకు విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
*  గతంలో హిట్టయిన 'సోగ్గాడే చిన్ని నాయనా' చిత్రానికి నాగార్జున ఇప్పుడు సీక్వెల్ చేస్తున్న సంగతి తెలిసిందే. 'బంగార్రాజు' పేరుతో కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నాగార్జున తనయుడు అఖిల్ ఓ గెస్ట్ రోల్ చేయనున్నాడట.
*  తాజాగా 'మజిలీ' చిత్రంతో మంచి హిట్ కొట్టిన దర్శకుడు శివ నిర్వాణ తన తదుపరి చిత్రాన్ని విజయ్ దేవరకొండ హీరోగా చేస్తున్నట్టు తాజా సమాచారం. ఇందుకు సంబంధించిన స్క్రిప్ట్ పని జరుగుతోందట.  
Go Back to Shorts
Anupama
nagarjuna
akhil
vijay

More Telugu News