సైకిల్ గుర్తుకే ఓటేయండి... రేపల్లె టీడీపీ అభ్యర్థికి సమంత మద్దతు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సైకిల్ గుర్తుకే ఓటేయండి... రేపల్లె టీడీపీ అభ్యర్థికి సమంత మద్దతు

  • ఆయన మా ఫ్యామిలీ ఫ్రెండ్
  • తన ఫ్రెండ్ సోదరుడు అంటున్న నటి
  • మంచి వ్యక్తి కాబట్టే మద్దతు ఇస్తున్నా
దక్షిణాది చిత్ర పరిశ్రమలో ప్రతిభావంతురాలైన నటిగా పేరు తెచ్చుకున్న సమంత ఈ ఎన్నికల్లో రేపల్లె సిట్టింగ్ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ కు మద్దతిస్తోంది. ఈ మేరకు ఓ వీడియో లో అభిమానులకు విజ్ఞప్తి చేసింది. సైకిల్ గుర్తుపై ఓటేసి రేపల్లె టీడీపీ అభ్యర్థి అనగానిని గెలిపించాలని సూచించింది.

అయితే, అనగానికి మీకు ఏంటి సంబంధం అని ఓ నెటిజన్ ప్రశ్నించగా, ఆయన తమ ఫ్యామిలీ ఫ్రెండ్ అని సమంత బదులిచ్చింది. అనగాని సోదరి డాక్టర్ మంజుల తమ ప్రత్యూష ఫౌండేషన్ కార్యక్రమాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారని, తాను హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి అనగాని ఫ్యామిలీతో పరిచయం ఉందని తెలిపింది. సత్యప్రసాద్ మంచివాడు కాబట్టే తాను మద్దతు ఇస్తున్నానని సమంత వెల్లడించింది.

Samantha

More Telugu News