భద్రాచలంపై అప్పుడే ఎందుకు మాట్లాడలేదు.. ఒక కన్ను పోయాక గుర్తుకు వచ్చిందా?: చంద్రబాబుపై ఐవైఆర్ సెటైర్లు
- ఎన్నికల ముందే ఎందుకు గుర్తుకు వచ్చారు
- ప్రత్యేక జిల్లా చేస్తామని కేంద్రం నుంచి తెచ్చుకోవచ్చు కదా
- చంద్రబాబుపై విమర్శలు గుప్పించిన బీజేపీ నేత
అప్పుడే భద్రాచలాన్ని ప్రత్యేక జిల్లాగా చేస్తామని కేంద్రాన్ని ఒప్పించి ఏపీకి తెచ్చుకోవచ్చు కదా అని వ్యాఖ్యానించారు. అప్పట్లో రెండు కళ్ల సిద్ధాంతం కారణంగా ఈ విషయమై చంద్రబాబు మాట్లాడలేదనీ, కానీ ఈరోజు వాటిలో ఒక కన్ను పోయింది కాబట్టి అడుగుతున్నారని సెటైర్లు వేశారు.
ఈరోజు ఐవైఆర్ ట్విట్టర్ లో స్పందిస్తూ..‘నిజమే.. భద్రాచలం మనదే. రాములోరు మనవాడే. ఈ విషయం ఎన్నికల ముందు గుర్తొచ్చిందా? విభజన సమయంలో ఏమైంది? భద్రాచలాన్ని ప్రత్యేక జిల్లా చేస్తామని కేంద్రాన్ని ఒప్పించి తెచ్చుకోవచ్చు కదా! ఆ రోజు రెండు కళ్ల సిద్ధాంతం అడ్డు వచ్చింది. ఈరోజు ఒక కన్ను పోయింది కాబట్టి గట్టిగా అడుగుతున్నాం’ అని ట్వీట్ చేశారు.