‘భూతద్దం’లో చూసి మరీ ఓటు వేయండి: ఓటర్లకు ఎన్నికల సంఘం సూచన
- పోలింగ్ కేంద్రంలో తొలిసారి అందుబాటులో భూతద్దాలు
- వృద్ధుల కోసం ప్రత్యేక సదుపాయం
- సిరా, పోలింగ్ చీటీలు, ఇతర సామగ్రితోపాటు ఏర్పాటు
వయసుతోపాటు వచ్చే దృష్టిలోపం వల్ల కొందరు వృద్ధులు ఇబ్బంది పడే అవకాశం లేకపోలేదు. గుర్తును సరిగ్గా గుర్తించలేకుంటే వేరే వారికి ఓటువేసే ప్రమాదం ఉంది. ఈ సమస్యను గుర్తించి ప్రతి పోలింగ్ కేంద్రంలో ఒక భూతద్దం అందుబాటులో ఉంచుతున్నామని, అవసరమైన వారు ప్రిసైడింగ్ అధికారిని అడిగి తీసుకోవచ్చని సూచించింది. ఈ అద్దాన్ని ఉపయోగించి గుర్తులను పెద్దవిగా చూడవచ్చునని, తాము వేయాల్సిన గుర్తును గుర్తించవచ్చని తెలిపింది. అంధుల కోసం కూడా ఈసారి ఎన్నికల సంఘం ప్రత్యేక సదుపాయం కల్పించిన విషయం తెలిసిందే.