పుల్వామా దాడి గురించి కేంద్రానికి ముందే తెలుసు.. ఎన్నికల్లో గెలుపు కోసం పట్టించుకోలేదు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
- ఎన్నికల్లో గెలుపు కోసమే ఈ పని చేయనిచ్చారు
- లేదంటే ఉగ్రవాదులకు బాంబులు ఎక్కడి నుంచి వస్తాయి?
- మోదీ గెలవాలి కాబట్టే ఇది జరిగింది
ఫిబ్రవరి 14న పుల్వామాలోని సైనిక కాన్వాయ్‌పై జరిగిన ఆత్మాహుతి దాడిలో 40 మందికిపైగా భారత జవాన్లు అమరులయ్యారు. పాకిస్థాన్‌కు చెందిన జైషే మహ్మద్ సంస్థ ఈ ఘటనకు బాధ్యత ప్రకటించుకుంది. ఆ సంస్థకు చెందిన అదిల్ రషీద్ ఆత్మాహుతి దాడికి పాల్పద్డాడు. కారులో పేలుడు పదార్థాలు నింపుకుని సైనిక కాన్వాయ్‌ను ఢీకొట్టాడు.