తెనాలిలో కలకలం.. ఎన్నికల అధికారి ఆత్మహత్య
- ఎన్నికల విధుల కోసం పెదరావూరు వచ్చిన అధికారి
- అనారోగ్య కారణాలతోనే ఆత్మహత్య చేసుకున్నట్టు నోట్
- అధికారి స్వస్థలం ప్రకాశం జిల్లాలోని ఒంగోలు
సాంబశివరావు ఆత్మహత్యపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆయన వద్ద సూసైడ్ నోట్ దొరికిందని, అనారోగ్య కారణాలతోనే ఆత్మహత్య చేసుకున్నట్టు అందులో ఉందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.