కాపులంతా నాకు కాపు కాయాలి, టీడీపీని గెలిపించాలి: సీఎం చంద్రబాబు
- కాపులను బీసీల్లో చేర్చాం
- మోసాలు చేసే వాళ్లకు కాపులు ఓటేస్తారా?
- మనకు వైసీపీ రౌడీల పెత్తనం అవసరమా?
ఏపీకి ప్రత్యేక హోదా అన్నది కేసీఆర్, జగన్ కు అంతర్గత వ్యవహారమా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. జగన్ తనపై కేసులు ఉండటంతో మోదీని చూసి భయపడుతున్నారని విమర్శించారు. ఏపీకి న్యాయం జరగాలంటే మోదీ ఓటమిపాలు కావాల్సిందేనని, ఏపీకి మోదీ నమ్మకద్రోహం చేశారని నిప్పులు చెరిగారు. గత ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా మొత్తం టీడీపీకి బ్రహ్మరథం పట్టిందని, ఈ ఎన్నికల్లో కూడా అదే విధంగా జరగాలని కోరారు. మహిళలకు శాశ్వతంగా రుణపడి ఉంటానని, సేవ చేసే ప్రభుత్వాన్ని ఆదరించే బాధ్యత మహిళలదేనని అన్నారు.