మెగా ఫ్యామిలీలో నాగబాబు ఒక్కడే తేడా.. ఆయనకు తప్ప ఎవరికైనా ఓటువేయండి!: సినీ నటుడు శివాజీరాజా
- నాగబాబు వల్ల ‘మా’ ప్రతిష్ట దిగజారింది
- 600 మందికి న్యాయం చేయలేనోడు నరసాపురానికి చేస్తాడా?
- విమర్శలు గుప్పించిన ‘మా’ మాజీ అధ్యక్షుడు
హైదరాబాద్ లో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఏ పార్టీకి అయినా ఓటేయాలనీ, నాగబాబుకు మాత్రం వేయవద్దని కోరారు. ‘నేను ఇలా మాట్లాడటానికి సుమారు 15 రోజుల పాటు ఆలోచించాను. పవన్ కల్యాణ్ తన కష్టం ఏదో తాను పడుతున్నాడు. మెగా ఫ్యామిలీలో నాగబాబు ఒక్కడే తేడా. ఆయన భీమవరం నాది.. నరసాపురం నాది అంటున్నాడు..ఎలా అవుతుంది?
భీమవరంలో మురికివాడలు లేకుండా చేస్తావా? నరసాపురాన్ని బాగు చేస్తావా? నువ్వు వంటగదిలో నుంచి హాల్లోకి రావడానికే అరగంట పడుతుంది. అలాంటిది నువ్వు నరసాపురం వెళ్లి సేవ చేస్తావా?’ అంటూ ప్రశ్నలు సంధించారు. అలాగే ఈ ప్రపంచంలో తనకు చిరంజీవి తర్వాతే ఎవరైనా అని... తాను ఎప్పుడూ చిరంజీవికి పెద్ద అభిమానినే అని శివాజీ రాజా తెలిపారు.