వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డి గెలవాలంటూ అల్లు అర్జున్ శుభాకాంక్షలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డి గెలవాలంటూ అల్లు అర్జున్ శుభాకాంక్షలు

  • మరోసారి బహిరంగ లేఖ
  • శిల్పాను మిత్రుడిగా పేర్కొన్న బన్నీ
  • పార్టీ వేరైనా మిత్రధర్మంతో అభినందనలు చెబుతున్నట్టు వెల్లడి
టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ నిన్న జనసేనాని పవన్ కల్యాణ్, నరసాపురం ఎంపీ అభ్యర్థి నాగబాబులకు బహిరంగ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ట్విట్టర్ లో లేఖ రాశారు. అయితే, నేడు కూడా బన్నీ మరో లేఖ రాయగా, అది తన మిత్రుడు శిల్పా రవిచంద్రారెడ్డి కోసం కావడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. శిల్పా వైసీపీ నేత కావడంతో దీనిపై అందరి దృష్టి పడింది. శిల్పా రవిచంద్రారెడ్డి నంద్యాల నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు.

శిల్పా రవిరెడ్డి తన రాజకీయ ప్రస్థానం ఆరంభిస్తున్న ఈ తరుణంలో శుభాకాంక్షలు చెబుతున్నట్టు అల్లు అర్జున్ తన లేఖలో తెలిపారు. శిల్పాను బన్నీ తన సన్నిహిత మిత్రుడిగా పేర్కొన్నారు. చాలా సంవత్సరాలుగా తనకు మంచి స్నేహితుడిగా ఉన్నాడని, జెంటిల్మన్ అని వివరించాడు. అయితే, రాజకీయ పార్టీల పరంగా చూస్తే, తాము వేర్వేరు పార్టీలకు చెందినవాళ్లమని, తమ రాజకీయ భావజాలం కూడా పూర్తి భిన్నమని, కానీ స్నేహం కోసం తన మిత్రుడికి హార్దిక శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు బన్నీ వివరణ ఇచ్చారు.
Allu Arjun
YSRCP

More Telugu News