'ఆంధ్రజ్యోతి' రాధాకృష్ణా.. చంద్రబాబుతో కలిసి నువ్వు దోచుకున్న ప్రతి పైసా కక్కిస్తాం: విజయసాయిరెడ్డి ఫైర్
Add ap7am to your home Screen

'ఆంధ్రజ్యోతి' రాధాకృష్ణా.. చంద్రబాబుతో కలిసి నువ్వు దోచుకున్న ప్రతి పైసా కక్కిస్తాం: విజయసాయిరెడ్డి ఫైర్

  • నువ్వో చీడపురుగువి
  • నీపై ఈసీకి ఫిర్యాదు చేస్తాం
  • ఆ ఆడియోలో ఉన్నది నా వాయిస్ కాదు
వైసీపీ ముఖ్యనేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి 'ఆంధ్రజ్యోతి' రాధాకృష్ణపై నిప్పులు చెరిగారు. తనపై ఆంధ్రజ్యోతిలో అసత్య కథనాలు ప్రసారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇవాళ విజయసాయి ఆడియో టేపులంటూ కొన్ని క్లిప్పింగ్స్ మీడియాలో విశేషంగా ప్రసారమయ్యాయి. దీనిపై విజయసాయి తీవ్రస్థాయిలో స్పందించారు. ఆ ఆడియో టేపులో ఉన్నది తన వాయిస్ కాదని స్పష్టం చేశారు. తన గొంతు అందరికీ తెలుసని అన్నారు.

"ఆ ఆడియో టేపులో మా పార్టీ అధ్యక్షుడ్ని నేను కించపరిచేలా మాట్లాడుతున్నానంటూ ఏబీఎన్ చానల్ తప్పుగా ప్రచారం చేసింది. రాధాకృష్ణ నిజమైన పాత్రికేయుడు అయితే ఆడియో టేపులో ఉన్నది నా వాయిసే అని నిరూపించాలి. లక్ష్మీపార్వతిపైనా ఇలాగే దుష్ప్రచారం చేశారు. నువ్వు సమాజానికి ఏమాత్రం ఉపయోగపడని వ్యక్తివి. చీడపురుగువి. చంద్రబాబుతో కలిసి నువ్వు దోచుకున్న సొమ్మును ప్రతి పైసా కక్కిస్తాం. రాధాకృష్ణపై ఈసీకి ఫిర్యాదు చేస్తాం. హైదరాబాద్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తాం. అసత్య ప్రచారాలు చేస్తున్న ఆ చానల్ మూతపడాల్సిందే!" అంటూ విజయసాయిరెడ్డి ఎంతో ఆవేశంతో మాట్లాడారు.
Vijay Sai Reddy
YSRCP

More Telugu News