ఎన్నికల్లో జగన్ గెలిస్తే ప్రాజెక్టులన్నీ కేసీఆర్ హస్తగతమవుతాయి: చంద్రబాబు
- మోదీని చూస్తే జగన్కు భయం
- ప్రజలను తాకట్టు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు
- ప్రభుత్వ సొమ్మును పంచుతుంటే అడ్డుకుంటున్నారు
- కాల్వలో పారేది నీరు కాదు, కన్నీరు
ప్రభుత్వ సంపదను ప్రజలకు పంచుతుంటే వైసీపీ నేతలు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఇకపై ప్రతి ఏడాది మహిళలకు ‘పసుపు-కుంకుమ’ ఇస్తానని ప్రకటించారు. మచ్చుమర్రి, పోతిరెడ్డిపాడులను మూసివేయాలని కేసీఆర్ కోరుతున్నారని, అవి మూసేస్తే రాయలసీమ ఎడారి అవుతుందన్నారు. జగన్ అధికారంలోకి వస్తే కాల్వల్లో పారేది నీరు కాదని, కన్నీరని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీని ప్రత్యేక హోదా అడిగితే ఎదురు దాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.