టీడీపీ నేతలపై ఉన్న ఆరోపణలతో పోలిస్తే జగన్ పై ఉన్నవి ఎంత?: జీవితా రాజశేఖర్
- కాల్ మనీ కేసులో టీడీపీ నేతలు లేరా?
- మహిళలను అవమానపరిచిన టీడీపీ నేతలు లేరా?
- రాష్ట్రాన్ని చంద్రబాబు కుటుంబం దోచుకుంటోంది
మహిళలను ఎంతగా అవమానపరచాలో అంతగా అవమానపరుస్తున్న టీడీపీ ప్రభుత్వం, ‘పసుపు-కుంకుమ’ పేరుతో డబ్బులివ్వడం విడ్డూరమని విమర్శించారు. రాష్ట్రాన్ని చంద్రబాబు, ఆయన కొడుకు, నందమూరి బాలకృష్ణ దోచుకుంటున్నారని, ఇప్పుడు, కొత్తగా బాలకృష్ణ చిన్నల్లుడు కూడా తోడయ్యాడని ఆరోపించారు. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీళ్లందరూ కలిసి మూకుమ్మడిగా కొట్టేసిస్తున్న డబ్బు ఎంత? అని ప్రశ్నించారు.