దిల్ రాజు నుంచి గిఫ్టుగా మరో దర్శకుడికి ఖరీదైన కారు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దిల్ రాజు నుంచి గిఫ్టుగా మరో దర్శకుడికి ఖరీదైన కారు

  • వరుస విజయాలతో దిల్ రాజు
  • దర్శకుడి కష్టం తెలిసిన నిర్మాత
  • వేణు శ్రీరామ్ తో కొత్త ప్రాజెక్టు  
నిర్మాతగా వరుస సినిమాలను చేస్తూ .. విజయాలను అందుకుంటూ దిల్ రాజు ముందుకు వెళుతున్నారు. ఈ మధ్య ఆయన నిర్మించిన 'ఎఫ్ 2' సినిమా విడుదలైన అన్ని ప్రాంతాల్లోను విజయవిహారం చేసింది. దిల్ రాజుకి అత్యధిక లాభాలను తెచ్చిపెట్టింది. దాంతో దిల్ రాజు ఆ సినిమా దర్శకుడైన అనిల్ రావిపూడికి ఖరీదైన కారును కానుకగా ఇచ్చారు. ఇక తాజాగా ఆయన దర్శకుడు వేణు శ్రీరామ్ కి కూడా ఖరీదైన కారును కానుకగా ఇచ్చినట్టుగా సమాచారం.

దిల్ రాజు బ్యానర్లో వేణు శ్రీరామ్ చాలా కాలంగా పనిచేస్తూ వస్తున్నాడు. దిల్ రాజుకి 'మిడిల్ క్లాస్ అబ్బాయి'తో హిట్ కూడా ఇచ్చాడు. అలాంటి వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు ఒక సినిమా చేయాలనుకున్నారు. దాంతో తన దగ్గరున్న కథతో అల్లు అర్జున్ ను ఒప్పిస్తానని చెప్పి వెళ్లిన వేణు శ్రీరామ్, ఆ విషయంలో సక్సెస్ ను సాధించాడు. ఆయన వినిపించిన కథలోని కొత్తదనం నచ్చడంతో, త్రివిక్రమ్ సినిమా పూర్తికాగానే ఈ సినిమానే చేస్తానని అల్లు అర్జున్ మాట ఇచ్చేశాడు. అల్లు అర్జున్ వంటి పెద్ద హీరోను వెంటనే ఒప్పించినందుకుగాను వేణు శ్రీరామ్ కి దిల్ రాజు ఒక ఖరీదైన కారును గిఫ్టుగా ఇచ్చాడని అంటున్నారు.
dil raju
venu sriram

More Telugu News