చంద్రబాబు పేరులోని ‘ద్ర’ అంటే దరిద్రమని ప్రజలు అనుకుంటున్నారు!: విజయసాయిరెడ్డి సెటైర్లు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చంద్రబాబు పేరులోని ‘ద్ర’ అంటే దరిద్రమని ప్రజలు అనుకుంటున్నారు!: విజయసాయిరెడ్డి సెటైర్లు

  • కరవు కాటకాలు, తుపాన్లు బాబు వెంటే ఉంటాయి
  • జగన్ పేరులో గన్ ఉందని భూగోళ, ఖగోళ శాస్త్రాలు శోధించి కనిబెట్టాడు
  • టీడీపీ అధినేతపై విమర్శల వర్షం కురిపించిన వైసీపీ నేత
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. జగన్ పేరులో గన్ ఉందని బాబు చెబుతున్నారనీ, మరి చంద్రబాబు పేరులో ‘ద్ర’ అంటే దరిద్రమని ప్రజలంతా చెప్పుకుంటున్నారని విమర్శించారు. జగన్ పేరులో గన్ ఉందన్న విషయాన్ని చంద్రబాబు భూగోళ, ఖగోళ శాస్త్రాలన్నింటిని శోధించి కనిబెట్టారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు వెంట తుపాన్లు, కరవు కాటకాలు కాచుకుని ఉంటాయని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జనాలు నవ్వుకుంటారన్న స్పృహ కూడా లేకుండా చంద్రబాబు వణుకుతూ ఏదో గొణుగుతున్నారని వ్యాఖ్యానించారు.

విజయసాయిరెడ్డి ఈరోజు ట్విట్టర్ లో స్పందిస్తూ..‘ జగన్‌ గారి పేరులోనే గన్ ఉందట. తుప్పునాయుడు భూగోళ, ఖగోళ శాస్త్రాలన్నింటిని శోధించి కనిపెట్టాడు. తమరి పేరులోని “ద్ర” అంటే దరిద్రం అంటున్నారు ప్రజలు. కరువు కాటకాలు, తుఫాన్లు తమరి వెంటే కాచుకుని ఉంటాయి కదా. వణుకుతో ఏదేదో సణుగుతున్నారు. జనాలు నవ్వుకుంటారన్న సృహ కూడా లేదు’ అని దుయ్యబట్టారు.
Andhra Pradesh
Chandrababu
Telugudesam
YSRCP
Jagan
Vijay Sai Reddy
Twitter

More Telugu News