శ్రీకాకుళం జిల్లాలో భారీగా నగదు స్వాధీనం.. బస్సులోని 30 మంది పోలీస్ స్టేషన్ కు తరలింపు!

  • బస్సులో పాలకొండ వైసీపీ నేత తనయుడు
  • నగదు రూ.కోటి వరకూ ఉండొచ్చని అంచనా
  • అందరినీ విచారిస్తున్న రాజాం పోలీసులు
సార్వత్రిక ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు భారీగా నగదు బయటపడింది. జిల్లాలోని రాజాం మండలం బొద్దాం వద్ద ఓ ఆర్టీసీ బస్సులో మూడు బ్యాగుల్లో పెద్దఎత్తున తరలిస్తున్న నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తం నగదు సుమారు రూ.కోటి వరకూ ఉండొచ్చని భావిస్తున్నారు.

ఈ బస్సు శ్రీకాకుళం నుంచి పాలకొండకు వెళుతుండగా అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా బస్సులో ప్రయాణిస్తున్న 30 మంది ప్రయాణికులను రాజాం పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాగా, ఈ నగదును ఎవరు తరలిస్తున్నారు? అని అందరినీ విచారిస్తున్నారు. కాగా, ఇదే బస్సులో పాలకొండకు చెందిన వైసీపీ నేత తనయుడు విక్రాంత్ ఉండటంతో ఆయన్ను కూడా పోలీసులు విచారిస్తున్నారు.
Go Back to Shorts
Andhra Pradesh
Srikakulam District
cash
bus
Police
1 crore

More Telugu News