Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చెన్నై మార్కెట్‌లో మాజీ క్రికెటర్‌ మాథ్యూహెడెన్‌.. మారువేషంలో షాపింగ్‌!

  • రిటైరయ్యాక కామెంటేటర్‌ అవతారం
  • ఐపీఎల్‌ మ్యాచ్‌ కోసం చైన్నై రాక
  • కృత్రిమ గెడ్డం తగిలించుకుని టీ నగర్‌ ప్రాంతంలో సంచారం
ఒకప్పటి ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టు సభ్యుడు, డ్యాషింగ్‌ బ్యాట్స్‌మెన్‌ మ్యాథ్యూ హెడెన్‌ చెన్నై టి నగర్‌ మార్కెట్‌లో సందడి చేశాడు. క్రికెట్‌ నుంచి రిటైరయ్యాక కామెంటేటర్‌ అవతారం ఎత్తిన ఓపెనర్ హెడెన్‌ ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌ 12వ సీజన్‌ మ్యాచ్‌కు కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు. చెన్నైసూపర్‌కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌  జట్ట మధ్య జరిగిన మ్యాచ్‌ కోసం చెన్నై వచ్చిన ఈ మాజీ విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌ మారువేషంలో వెళ్లి మార్కెట్‌ చేశాడు.

ఆస్ట్రేలియా లెజండరీ స్పిన్నర్‌ షేన్‌వార్న్‌ చెన్నై మార్కెట్‌లో ఓ వెయ్యి రూపాయల వస్తువు కొనాలంటూ చేసిన చాలెంజ్‌ని పూర్తి చేసేందుకు హెడెన్‌ కొత్త అవతారం ఎత్తక తప్పలేదు. కృత్రిమ గెడ్డం, నెత్తిపై టోపీ పెట్టుకుని గుర్తు పట్టలేని విధంగా తయారై టీ నగర్‌ మార్కెట్‌లో తిరిగాడు. అక్కడ రూ.180 పెట్టి ఓ వాచ్‌తోపాటు లుంగీలు, షర్ట్‌లు మొత్తం వెయ్యిలోపు విలువైన వస్తువులు కొన్నాడు. స్థానికంగా ఉన్న ఓ యువకుని సాయంతో తానీ మార్కెట్‌ చాలెంజ్‌ పూర్తి చేశానంటూ ఆ తర్వాత హెడెన్‌ స్వయంగా ఇన్‌స్టా గ్రామ్‌లో రాసుకున్నాడు.
mathue heden
Australia
chennai mrket

More Telugu News