భవిష్యత్తులో టీఆర్ఎస్ నేతలు కీలక పదవులు పొందుతారు: సీఎం కేసీఆర్
- టీఆర్ఎస్ నేతలు గవర్నర్లు, విదేశీ రాయబారులు అయ్యే రోజులొస్తాయి
- దేశ భవిష్యత్ ను నిర్ణయించడంలో ఈ ఎన్నికలు కీలకం
- ఎన్నికల తర్వాత నర్సరీ రైతులకు ఉచిత కరెంట్ ఇస్తాం
ఈ ఎన్నికల తర్వాత నర్సరీ రైతులకు ఉచిత కరెంట్ ఇస్తామని, సుబాబుల్ రైతుల సమస్యలు కూడా పరిష్కరిస్తామని ఈ సందర్భంగా కేసీఆర్ హామీ ఇచ్చారు. ఖమ్మం జిల్లాలో ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తామని, సీతారామ ప్రాజెక్టు పూర్తయితే జిల్లా కష్టాలు తీరతాయని, ఈ ప్రాజెక్టులతో రెండు పంటలకు నీరు అందుతుందని చెప్పారు. బయ్యారం ఉక్కు పరిశ్రమను కచ్చితంగా సాధించుకుని తీరతామని అన్నారు.