​ మార్కెట్లో రికార్డు సృష్టించిన బజాజ్ పల్సర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

​ మార్కెట్లో రికార్డు సృష్టించిన బజాజ్ పల్సర్

  • ఒక్క నెలలో లక్షకు పైగా బైకులు అమ్మకం
  • ఏటా పెరుగుతున్న పల్సర్ విక్రయాలు
  • మార్చి నెలలో ఊహించని డిమాండ్
ఈ మార్చి నెలలో భారత్ లో వాహన విక్రయాల విపణి ఇతర సంస్థలకు ఏమంత ఆశాజనకంగా లేకపోయినా బజాజ్ మాత్రం రికార్డు సృష్టించింది. బజాజ్ ఉత్పత్తుల్లో ఎంతో ప్రాచుర్యం పొందిన పల్సర్ బైక్ ఒక్క నెలలో లక్షకు పైగా అమ్మకాలతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. జాతీయ మార్కెట్లో పల్సర్ ఒక్క నెలలో లక్ష మార్కు దాటడం ఇదే ప్రథమం. ఇంతకుముందు పల్సర్ అమ్మకాలు సగటున నెలకు 45 వేల నుంచి 60 వేల మధ్యలో ఉండేవి. గతేడాది మార్చితో పోల్చితే పల్సర్ అమ్మకాల్లో 39 శాతం వృద్ధి కనిపిస్తోందని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. 2001లో మార్కెట్లోకి వచ్చిన పల్సర్ మొదట 150 సీసీ విభాగంలో పట్టు సాధించింది. ఆపై 220 సీసీ వరకు తిరుగులేని ఆధిపత్యాన్ని అందుకుంది.
Bajaj Pulsar
India

More Telugu News