బీజేపీ తీర్థం పుచ్చుకున్న మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్.. కాంగ్రెస్ పై ఘాటు విమర్శలు!

  • కేంద్ర మంత్రి జేడీ నడ్డా సమక్షంలో చేరిక 
  • కాంగ్రెస్ కి ఎంత సేవ చేసినా గుర్తింపు లేదని ఆవేదన
  • దేశాన్ని ముందుకు తీసుకెళ్లడం బీజేపీ వల్లే సాధ్యమని వ్యాఖ్య
కాంగ్ర్ పార్టీ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్ ఈరోజు బీజేపీలో చేరారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన భాస్కర్ తాజాగా ఢిల్లీలో కేంద్ర మంత్రి జేడీ నడ్డా సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. విధేయత ఉన్న కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీలో గౌరవం లేదని విమర్శించారు. పార్టీకి ఎంత సేవ చేసినా గుర్తింపు లభించలేదనీ, నిర్లక్ష్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

అందుకే బీజేపీలో చేరుతున్నానని ప్రకటించారు. ప్రధాని మోదీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే అది బీజేపీ వల్లే సాధ్యమని స్పష్టం చేశారు. తెలంగాణలో ఈసారి బీజేపీ అనూహ్య ఫలితాలు సాధిస్తుందని జోస్యం చెప్పారు.

Telangana
Congress
BJP
rapolu anand bhaskar

More Telugu News