ఎన్నికల నేపథ్యంలో.. తెలుగు రాష్ట్రాల్లో కనిపించని 2 వేల నోటు!
- ఏటీఎంలలో రూ. 500, రూ. 100 నోట్లే
- ఎన్నికల కారణంగానే షార్టేజ్
- పెద్ద నోట్లను దాచేస్తున్న అభ్యర్థులు!
గత సంవత్సరం మార్చిలో దేశంలో చలామణిలో ఉన్న కరెన్సీలో సగానికి పైగా ఉన్న రూ. 2 వేల నోట్లు, ఈ సంవత్సరం మార్చికి వచ్చే సరికి 37.3 శాతానికి తగ్గాయి. ఆర్బీఐ వెల్లడించిన డేటా ప్రకారం మార్చి 2017 నాటికి మొత్తం 3,285 మిలియన్లు, మార్చి 2018 నాటికి 3,363 మిలియన్ల రూ. 2 వేల నోట్లు చలామణిలో ఉన్నాయి.
"గడచిన మూడు నెలలుగా డిపాజిట్ల రూపంలో రూ. 2 వేల నోట్లు బ్యాంకులకు రావడం లేదు. ఆర్బీఐ నుంచి కూడా సరఫరా లేకపోవడంతోనే షార్టేజ్ ఏర్పడింది. ఎన్నికలు ముగిసిన తరువాత పరిస్థితి అదుపులోకి వస్తుందని భావిస్తున్నాం" అని ఆంధ్రా బ్యాంక్ ఎంప్లాయిస్ యూనియన్ కార్యదర్శి కొండల్ రావు వ్యాఖ్యానించారు.