బస్సు నడుపుతుండగా అకస్మాత్తుగా ఫిట్స్ రావడంతో క్వాలిస్‌ను ఢీకొట్టిన డ్రైవర్

  • అదుపు తప్పిన బస్సు
  • దెబ్బతిన్న వాహనాల ముందు భాగాలు
  • ప్రయాణికులకు స్వల్ప గాయాలు
ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కు అకస్మాతుగా ఫిట్స్ రావడంతో బస్సు అదుపుతప్పి క్వాలిస్‌ను ఢీకొట్టింది. పెను ప్రమాదమేమీ జరగకున్నా కొందరు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. కామారెడ్డి మండలం అడ్లూర్ బైపార్ జాతీయ రహదారి వద్ద ఈ ఘటన జరిగింది. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వెళుతున్న నిజామాబాద్‌ డిపో-2 రాజధాని బస్సు డ్రైవర్‌ రాంలాల్‌‌కు అడ్లూరు జాతీయ రహదారి వద్దకు రాగానే ఫిట్స్ వచ్చాయి.

దీంతో బస్సు అదుపుతప్పి డివైడర్‌ను దాటి ఎదురుగా వస్తున్న క్వాలిస్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో క్వాలిస్ 100 మీటర్ల దూరం దూసుకెళ్లి సైడ్ వాల్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు, క్వాలిస్ ముందు భాగాలు దెబ్బతిన్నాయి. బస్సులోని కొందరు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్‌కు ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.
Go Back to Shorts
Rajadhani
Kamareddy
Ram Lal
Qualis
Hospital

More Telugu News